పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
మంచిర్యాల,అర్జున్ సమాచారం: మండల తహసిల్దార్ కార్యాలయాలలోని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తహసిల్దార్ సిబ్బందితో పలు రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్.- 2026 లో భాగంగా దావాలు అభ్యంతరాల పరిష్కరణ వేగవంతం చేయాలని తెలిపారు కార్యాలయానికి సంబంధించిన పెండింగ్ సర్టిఫికెట్ల,భూ భారతి ద్వారా అందిన దరఖాస్తులు జి.ఓ.ఎం.ఎస్.నం.59, భూదాన్ భూములకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ...