పేదల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పట్టాభిషేకం పేదలకు పట్టాభిషేకం లో సీఎం చంద్రబాబు

విజయవాడ,అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ప్రజలు వేసిన ప్రతి ఓటుకూ న్యాయం చేస్తున్నాం. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడుతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని అన్నారు. విశాఖపట్నంలో 28 వేల మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, ఇప్పుడు విజయవాడలో 26 వేల మంది కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నాం. మొత్తం కలిపి 60 వేల మంది పేదలకు పట్టాలు ఇవ్వటం...