పేపర్ లో వార్త ఆధారంగా చర్యలు తీసుకోలేం తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ,  అక్టోబరు 5,అర్జున్ సమాచారం: కేవలం పేపర్ రిపోర్ట్ ఆధారంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పనితీరు, చర్యలపై లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లో ఎస్‌ఐటీ  విచారణ జరిపించాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సైతం చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అందులో కోరారు. ఈ వ్యవహారంలో కేం ప్రభుత్వం, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు, క్యాబినెట్ కార్యదర్శి, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్...