పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ ‘LEGACY’ మూవీ *మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’ *మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘LEGACY’. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘LEGACY’ అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా నుంచి వస్తున్న రెండో చిత్రం...