పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇస్తున్నారన్న కవిత నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని విమర్శ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని గుర్తించాలని సూచన

అర్జున్ సమాచారం: పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదీ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, ఈ విషయం ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాలతో మరోసారి బహిర్గతమైందని ఆమె విమర్శించారు. ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో రాష్ట్ర అధికారులు గోదావరి - కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ నుంచి చేపట్టాలని కోరుతుంటే... మరోవైపు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్...