పోలీసు శాఖలో కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై శిక్షణ పీటీసీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం

కరీంనగర్,అర్జున్ సమాచారం: ఆధునిక సాంకేతికతతో నేర నియంత్రణ, దర్యాప్తులో మరింత సామర్థ్యం పెంపే లక్ష్యం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పిటిసి  కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు....