పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల,అర్జున్ సమాచారం: జిల్లాలో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పోలీస్‌, అటవీ శాఖలు పరస్పర సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ  అశోక్‌కుమార్‌,  సూచించారు. ఈ రోజు జిల్లా పోలీస్  ప్రదాన కార్యాలయంలో  పోలీస్‌, అటవీ శాఖల అధికారులతో నిర్వహించిన కోఆర్డినేషన్‌ సమావేశంలో జిల్లాలో అటవీ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న చర్యలు, ఇరు శాఖలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరస్పర సహకారం అవసరమైన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ...