పోలీస్ స్టేషన్‌ ముందు రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడితో కలిసి ఎఫ్‌ఐఆర్‌ కోసం డిమాండ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21,అర్జున్ సమాచారం: పెల్లెట్ గన్ గాయాల వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో ఆందోళనకు దిగారు. జులై 20న జరిగిన జెన్‌-జీ విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న సాహిల్ లోచాబ్‌ను వెంటబెట్టుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం సీనియర్ పోలీస్ అధికారి కార్యాలయం బయట బాధితుడితో కలిసి ధర్నాకు కూర్చున్నారు.జులై 20న పరీక్షల పేపర్ లీక్‌లకు నిరసనగా వందలాది మంది విద్యార్థులు...