ప్రకృతితో అనుసంధానం ద్వారా ప్రజలకు అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి నగర వనాల్లో స్వచ్ఛమైన, ఆహ్లాదకర వాతావరణం అన్ని ప్రాంతాలను కలిపేలా పర్యాటక అభివృద్ధి నగర వన యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 6 నగరవనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అర్జున్ సమాచారం: రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  చెప్పారు. నల్లమల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పర్యాటక కళను తీసుకొచ్చేలా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమైన 6 నగరవనాలను ఉప ముఖ్యమంత్రి మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా...