ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలి. పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం: భారీ వర్షాల నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని  పోలీసు కమిషనర్  వీసీ సజ్జనర్,  సూచించారు. వాతావరణ కేంద్రం విడుదల చేసే సమాచారాన్ని, హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్ష సూచనల ఆధారంగా తమ రోజువారీ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిదని ఆయన చెప్పారు. వర్షాల నేపథ్యంలో గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలను, రోడ్డుపై ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించి, విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి...