ప్రజలకు నిస్పాక్షికంగా సేవలు అందించాలి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
జయశంకర్ భూపాలపల్లి,అర్జున్ సమాచారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వార్షిక తనిఖీల్లో భాగంగా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు., అనంతరం పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల స్థితిగతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను...