ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం రూ.360 కోట్లతో రెవెన్యూ శాశ్వత భవనాలు 10 ఆర్డీవో,107 తహశీల్ధార్, 53 సబ్ రిజిస్ట్రార్ భవనాల నిర్మాణం – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలు అందించాలనే లక్ష్యంతో దశలవారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భవనాల నిర్మాణాలపై మంగళవారం నాడు అధికారులతో మంత్రి గారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10...