ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం.. ది సుపరిపాలనకు దక్కిన గౌరవం: సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం ఇది తన ప్రభుత్వ సుపరిపాలనకు లభించిన ఆమోదమన్న సీఎం చంద్రబాబు 2024 సాధారణ ఎన్నికల కంటే ఇప్పుడు ఆదరణ మరింత పెరిగిందని వెల్ల‌డి అనేక జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతు పూర్తిగా కరువైందని వ్యాఖ్య‌

అమరావతి, అర్జున్ సమాచారం: ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వ సుపరిపాలనకు, రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "మంచి పరిపాలన మంచి రాజకీయాలకు దారితీస్తుంది (గుడ్ గవర్నెన్సు లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్)" అని తాను నిరంతరం విశ్వసిస్తానని, ఆ నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిజం చేశారని...