ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వానికి జగన్ కీలక సూచనలు ఆర్నాబ్ తుపానుపై ప్రజలకు మాజీ సీఎం జగన్ హెచ్చరిక ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ రంగంలోకి దిగి సేవ చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపు తుపాను ధాటికి రద్దయిన 100కు పైగా రైళ్లు, పలు విమానాలు

తాడేపల్లి,అర్జున్ సమాచారం: ఆర్నాబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు, ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రాణనష్టాన్ని నివారించడానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి ఆహారం, తాగునీరు, మందులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు,...