ప్రజావాణిలో రాఘవాపూర్ సర్పంచ్ పై ఫిర్యాదు
పెద్దపల్లి,అర్జున్ సమాచారం: మండలంలోని రాఘవపూర్ గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ పలువురు గ్రామస్థులు విచారణకు డిమాండ్ చేశారు. పంచా యతీ నిధులను నిబంధనల కు విరుద్ధంగా మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామపంచాయ తీకి వివిధ రూపాల్లో వచ్చిన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించకుం డా దారిమళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు...