ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్,అర్జున్ సమాచారం: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్ఓ స్వామి, ఇతర ఉన్నత అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కి మొత్తం 193 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా నగరపాలికకు 58, గృహ నిర్మాణ శాఖకు 42 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. సీఎం క్యాంపు కార్యాలయం, సీఎస్ ప్రజావాణి దరఖాస్తుల...