ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 7:56 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రజాస్వామ్య పరిరక్షణే భారత్ సమ్మిట్ ప్రధాన లక్ష్యం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ప్రతిపక్షం అధికార పక్షానికి శత్రువు కాదు.. ప్రజాస్వామ్యంలో కీలక భాగస్వామని   డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.   విద్వేష రాజకీయాలకు, సమాజ విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్ వేదికగా ప్రపంచ సమాలోచన.  దావోస్ తరహాలో ప్రపంచ రాజకీయ, సామాజిక విధానాలకు హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా ఎదగాలి.  70కి పైగా దేశాలు.. 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు.. హైదరాబాద్లో భారత్ సమ్మిట్  జరగనుందని అన్నారు.
‎ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తోంది. మహాత్మాగాంధీ బోధించిన అహింసా మార్గం, నెహ్రూ ప్రవచించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం. ‎ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విద్వేష రాజకీయాలు, హింస, సామాజిక విభజనకు భారత్ సమ్మిట్ ద్వారా ప్రజాస్వామ్య పరిష్కారాలపై చర్చ. ‎ ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు కీలకమైన స్తంభాలని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలను, నాయకులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధం. ‎ప్రతిపక్షాల గొంతుకను అణచివేయడం, వాటిని అంతం చేయాలనుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ‎భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‎అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు భారత్ సమ్మిట్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణపై చర్చించాలని ఆహ్వానమని అన్నారు. ‎80వ స్వాతంత్ర్య దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి నేపథ్యంలో భారత్ సమ్మిట్కు ప్రత్యేక ప్రాధాన్యత వుంటుందని అన్నారు.