ప్రజా భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల,అర్జున్ సమాచారం: ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను నిరంతరం పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే శుక్రవారం రోజున వీర్నపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న...