ప్రజా సంక్షేమానికి చిరునామా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 8: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట సిటీ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, రైతు...