ప్రజా సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
తుగ్గలి,అర్జున్ సమాచారం : : ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శుక్రవారం పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండల కేంద్రంలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమం 4వ పర్యటనలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రీ ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఫిర్యాదులు పరిష్కరించడంపై...