ప్రణబ్ ముఖర్జీ సలహాతోనే బీజేపీలో చేరా.. బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు! – ఉద్యోగిలా ఉండొద్దని రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ సలహా ఇచ్చారని వెల్లడి – టీఎంసీని అత్తా-అల్లుళ్ల ప్రైవేట్ కంపెనీతో పోల్చినట్లు వ్యాఖ్యలు – ప్రణబ్ ముఖర్జీ తనకు అసలైన సలహాదారు అని వెల్లడి – 2020లో బీజేపీ తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి
కొల్ కత్తా,అర్జున్ సమాచారం: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారి భారత మాజీ రాష్ట్రపతి, దివంగత కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వీడి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బీజేపీ వైపు వెళ్లాలని నాడు రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీయే తనకు సలహా ఇచ్చారని ఆయన తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు మార్గదర్శి, అసలైన సలహాదారు ప్రణబ్ ముఖర్జీయేనని సువేందు...