రంపచోడవరం,అర్జున్ సమాచారం:
విద్యయే అభివృద్ధికి సోపానమని, ప్రతి పిల్లవాడిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పోలవరం నియోజకవర్గం రంపచోడవరంలో భారీ ఎత్తున నిర్వహించిన *మెగా పేరెంట్స్ 4.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హాజరై తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
లక్షలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చిన ఈ సభతో రంపచోడవరం పసుపుమయమైంది.
తల్లిదండ్రులే నిజమైన హీరోలు: చంద్రబాబు
సభలో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు.
“పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులే నిజమైన హీరోలు. ప్రభుత్వం బడులు కడుతుంది, ఉపాధ్యాయులను ఇస్తుంది. కానీ పిల్లలను పుస్తకాల దగ్గర కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీదే. ప్రతి పేదింటి పిల్లవాడిని ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ ను చేయాలన్నదే మా కల” అని అన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు, డిజిటల్ సదుపాయాలతో పాటు ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. “మెగా పేరెంట్స్” ద్వారా ప్రతి తల్లిదండ్రిని విద్యలో భాగస్వామిని చేస్తామని చెప్పారు.
గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి.
నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవం తీసుకొస్తున్నామన్నారు.
“ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, ట్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, స్కిల్ కోర్సులతో ప్రభుత్వ బడులను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేస్తున్నాం. తల్లిదండ్రులు, టీచర్లు, ప్రభుత్వం కలిస్తే ఏపీని విద్యలో నంబర్-1గా నిలుపుతాం” అని ప్రకటించారు.
పసుపుమయమైన రంపచోడవరం
సీఎం, మంత్రి రాకతో రంపచోడవరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు రాకతో జై చంద్రబాబు, జై లోకేష్” నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
సభకు విచ్చేసిన అతిరథ మహారథులకు, లక్షలాది మంది ప్రజలకు ఎమ్మెల్యే శిరీష దేవి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు
=====================