ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 8:18 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు వరంగల్ సీపీ ప్రోత్సాహం – హ్యాండ్‌మేడ్ వస్తువుల కొనుగోలు

హనుమకొండ,అర్జున్ సమాచారం:
బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన ప్రత్యేక విద్యార్థులు, కేంద్రం వ్యవస్థాపకురాలు రామలీల, ఈసీ సభ్యుడు కల్యాణ్‌తో కలిసి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత,  స్టాల్‌ను సందర్శించి, ప్రత్యేక విద్యార్థులు స్వయంగా తయారుచేసిన హ్యాండ్‌మేడ్ వస్తువులను కొనుగోలు చేశారు. విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాలను అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు. ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు.
అనంతరం ప్రత్యేక విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, ఎ ఆర్ అడిషనల్ డీసీపీ సురేష్, ఆర్ఐ (అడ్మిన్) సర్జన్ రాజ్, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, ఆర్ఐ శ్రీధర్ , మల్లికాంబ మనోవికాస కేంద్రం సిబ్బంది  మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
==========================