ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల శాంతియుత సమ్మె నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు సరిపోని సౌకర్యాలు. హాస్టళ్లు, తరగతి గదులు, వసతులు కల్పించాలని విద్యార్థుల డిమాండ్

కరీంనగర్:ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు మౌలిక సదుపాయాల కొరతపై గళమెత్తారు. నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు సరిపడా వసతులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థులు శాంతియుత సమ్మె చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించి, కళాశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లకు సరిపడా ఆసుపత్రి సౌకర్యాలు లేవని, ప్రస్తుత కళాశాల భవనం కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు బ్యాచ్‌లకు కేవలం రెండు...