ప్రభుత్వ సేవలు మరింత సులభతరం మనమిత్ర ద్వారా ఫిర్యాదుల స్వీకరణ -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపిన అధికారులు అమరావతి, జూన్ 29,అర్జున్ సమాచారం : ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు....