ప్రభుత్వ స్థలాలను త్వరగా గుర్తించండి పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,అర్జున్ సమాచారం: హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు చెప్పారు. కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) లో ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి, శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, , పొన్నం ప్రభాకర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన స్థలాల గురించి అధికారులు...