ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదు హైదరాబాద్

నిర్మాత సి. కళ్యాణ్ సున్నం చెరువు ప్రాంతంలోని తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గుట్టల బేగంపేట్లోని సర్వే నంబర్లు 12, 12A, 13లో తమ ప్లాట్లు ఉన్నాయని ప్లాట్ ఓనర్స్ చెబుతున్నారు. అయితే.. ఇవాళ ఉదయం సి. కళ్యాణ్ పాటు మరికొందరు వ్యక్తులు తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా షీట్లతో అడ్డుకుంటున్నారని పేర్కొంటూ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు....