ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూత తెలుగు సినీ పరిశ్రమలో విషాదం

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు.. 1973లో 'జగమే మాయ' చిత్రంతో విలన్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ సినీ...