ప్రశాంత్ నగర్లో ప్రభుత్వ స్థలాలకు హైడ్రా రక్షణ 2,121 గజాలకు ఫెన్సింగ్.. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు
ఘట్కేసర్, నవంబర్ 13: అర్జున్ సమాచారం: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాలను హైడ్రా అధికారులు శుక్రవారం పరిరక్షించారు. కాలనీవాసుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సర్వే నంబర్లు 94, 95లోని మొత్తం 2,121 గజాల స్థలాలకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేశారు. ఇందులో పాఠశాలకు 868, పార్కుకు 765, కమ్యూనిటీ హాల్‌కు 488 గజాలు కేటాయించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ చర్యలపై కాలనీ...