ప్రేమ వేధింపుల కేసులో ముగ్గురు అరెస్ట్. ప్రధాన నిందితుడితో పాటు తల్లి, అక్కను అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు! మొబైల్ ఫోన్ స్వాధీనం.. నిందితుల ఒప్పుకోలు నమోదు!
అర్జున్ సమాచారం ,జులై 14, మంచిర్యాల : జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన యువతి గోషిక మాధవి ఆత్మహత్య కేసులో జైపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్‌తో పాటు అతని తల్లి గోనె శంకరమ్మ, అక్క గోనె శైలజలను మంగళవారం అదుపులోకి తీసుకుని నేర ఒప్పుకోలు పంచనామా నిర్వహించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు మంగళవారం ఎస్సై భూమేష్ తో...