ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలకు కళ్లెం?.. రవాణా శాఖకు హైకోర్టు కీలక ఆదేశం – ఛార్జీల నియంత్రణపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సూచన – పండుగ వేళల్లో ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని ప్రజాప్రయోజన వ్యాజ్యం – ఫిర్యాదులకు హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి
విజయవాడ: అర్జున్ సమాచారం: పండుగలు, సెలవు దినాల్లో ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెండు నెలల్లోగా సమగ్రంగా పరిశీలించి, తగిన కారణాలతో ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ధర్మాసనం పరిష్కరించింది. విజయవాడకు చెందిన చిట్టినేని సాంబశివరావు ఈ పిల్ దాఖలు చేశారు. పండుగలు, వారాంతాల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేటు...