ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో భారీగా నియామకాలు – వ్యవసాయ వర్సిటీలో 566 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం – ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం – రాతపరీక్షతో పాటు ఇంటర్వ్యూలు తప్పనిసరని స్పష్టీకరణ – త్వరలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీకి వర్సిటీ సన్నాహాలు

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వర్సిటీలో మొత్తం 566 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 48 ప్రొఫెసర్, 148 అసోసియేట్ ప్రొఫెసర్, 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, నూతన కోర్సుల ప్రవేశం, అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ప్రారంభం వంటి కారణాలతో వర్సిటీలో అధ్యాపకుల అవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీలను...