ఫతేనగర్ రైల్వే స్టేషన్ పరిశీలించిన ఎంపీ ఈటల కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన మెట్లను పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దికాలం క్రితం ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ మెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ తన చొరవతో హుటాహుటిన నూతన మెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన సమస్యలు మరియు స్థానికుల విజ్ఞప్తులు:
అర్జున్ సమాచారం: రైల్వే ట్రాక్ దాటేందుకు ఫతేనగర్ బ్రిడ్జిపైకి ఎక్కి దిగడం మహిళలు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని, ఇక్కడ వెంటనే ఎలివేటర్ ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని, మురికి నీరు వస్తుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫతేనగర్‌కు సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి నగర్‌లో సుమారు 10 వేల పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ వేలాది మంది పిల్లలు ఉన్నప్పటికీ పదవ తరగతి వరకు సరైన పాఠశాల సౌకర్యం లేదని, దీంతో విద్యార్థులు...