ఫాక్స్ సాగర్ ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా

కుత్బుల్లాపూర్, అర్జున్ సమాచారం: ఫాక్స్ సాగర్ ఎఫ్ టి ఎల్  పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. మల్లారెడ్డి ఫామ్ హౌస్ ప్రహరీ  కూల్చివేసారు. ఏకంగా అర కిలో మీటరు  హద్దుగా పెట్టుకొని ఫామ్ హౌస్ నిర్మాణానికి కట్టిన ప్రహరినీ హైడ్రా కూల్చి వేసింది. దూలపల్లిలో సర్వే నంబర్ 124లో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబీకులకు  సంబంధించిన ఫామ్ హౌస్ గేట్ కూడా ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉండగా దానిని తొలగించినట్లు హైడ్రా స్పష్టం చేసింది. జీడిమెట్ల సర్వే నంబర్ 41,42 లలో...