ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్,అర్జున్ సమాచారం: వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెరువుసింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందడం పై అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానితులు జంతువులను వేటాడుతున్నారన్న సమాచరంతో వారిని పట్టుకునేందుకు మరో ముగ్గురు బీట్ ఆఫీసర్లతో కలిసి వెళ్ళిన నవీన్ బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఈ...