ఫిర్యాదుదారులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలకు రావాలి: పోలీస్ కమిషనర్
సిద్దిపేట,అర్జున్ సమాచారం: సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ప్రజలు తమ ఫిర్యాదులు రోజంతా వివిధ సమయాల్లో వస్తుండటంతో ప్రతి ఒక్కరి సమస్యలను సమర్థవంతంగా స్వీకరించి పరిష్కరించే ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మి పెరుమాళ్, సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫిర్యాదులు ప్రతి పని దినంలో మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు స్వయంగా స్వీకరించనున్నారు. అందువల్ల సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫిర్యాదుదారులు కమిషనరేట్ కార్యాలయాన్ని ఆయా సమయంలోనే సంప్రదించాలని తెలిపారు....