బట్టింగ్ డబ్బులకోసం చైన్ స్నాచింగ్

కూకట్‌పల్లి,అర్జున్ సమాచారం: బెట్టింగ్ యాప్‌లకు బానిసై, ఓ వ్యక్తి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్ బస్టాప్ వద్ద ఓ మహిళ తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. బస్సు మిస్ కావడంతో కూకట్‌పల్లి వై జంక్షన్ వరకు బస్సును అనుసరించి, అక్కడ తన కుమార్తెను బస్సు ఎక్కించింది. అనంతరం ఇంటికి వెళ్లేందుకు వై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా.. కూకట్‌పల్లి నుంచి బాలానగర్ వైపు...