బద్వేలు,అర్జున్ సమాచారం:
బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా డీసీసీబీ చైర్మన్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి ఇక లాంచనమే అని చెప్పాలి సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ టిడిపి పగ్గాలు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గడచిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది ఇప్పటి బద్వేలు టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ సమన్వయకర్త విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీని నడిపించడంలో చాలావరకు విఫలమయ్యారని అధిష్టానం గుర్తించింది తాజాగా గత శనివారం జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి కడప జిల్లా నుండి అందరూ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జిలు హాజరయ్యారు కానీ బద్వేల్ నుంచి విజయమ్మ రితీష్ రెడ్డిలు హాజరు కాలేదు కారణం వారికి పిలుపు లేకపోవడమే సమావేశం జరుగుతున్న విషయం కూడా వారికి తెలియలేదు విజయమ్మ ఆమె తండ్రి దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి మృతి చెందిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది ఒకప్పుడు బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది వీరారెడ్డి మృతి చెందిన తర్వాత ఆ వైభవం లేకుండా పోయింది 2009 నుంచి బద్వేలు అసెంబ్లీ రిజర్వ్ అయింది రిజర్వ్ అయిన తర్వాత తాజాగా 2024 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోతూనే వస్తుంది 2024
ఎన్నికల్లో మాజీ ఇరిగేషన్ అధికారి రోశన్న బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది 2024 ఎన్నికల్లో కూటమి హావ రాష్ట్రమంతా వీచిన బద్వేల్ లో మాత్రం వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు కడప జిల్లాలో వైసిపి పాగా వేయకుండా చూడాలని ముఖ్యమంత్రి గట్టిగా నిర్ణయించారు అందులో భాగంగా బద్వేల్ లో టిడిపి ఇంచార్జ్ మార్పు కోసం ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం వేమలూరు గ్రామానికి చెందిన ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ ప్రస్తుత డీసీసీబీ చైర్మన్
మంచూరు సూర్య నారాయణ రెడ్డి ని బద్వేలు
తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం శనివారం జరిగిన కడప జిల్లా పార్టీ ఎమ్మెల్యేల వద్ద బద్వేలు నియోజకవర్గ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం క ఇది ఇలా ఉండగా సూర్యనారాయణ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి రావడంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు రితీష్ రెడ్డి ప్రమేయం ఏమాత్రం లేదని పార్టీలోని వారు చెపుతుంటారు ప్రస్తుతం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి పార్టీ నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి అంతేకాక వైసీపీలోని చాలామందితో ఆయనకు మంచి సంబంధం ఉన్నట్లు అధిష్టానానికి లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి ఇది కూడా మైనస్ గా మారింది నియోజకవర్గంలోని గ్రూపులు కట్టడి చేయడంలో రితీష్ రెడ్డి విఫలమైనట్లు పార్టీ అధిష్టానం గుర్తించింది అందుకే శనివారం జరిగిన సమావేశానికి విజయమ్మ రెడ్డిలకు రాలేదు.
సూర్యనారాయణరెడ్డి విజయమ్మ రితీష్ రెడ్డిల
మధ్య గత ఏడు నెలలుగా తగాదాలు ఉన్నాయి
రోజురోజుకు ఈ విభేదాలు మరింతగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలో టిడిపి ఇన్చార్జిగా సూర్యనారాయణ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి దివంగత మంత్రి వీరారెడ్డి పార్టీకి ఎంతో సేవలందించారు బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చేశారు ఆయన చనిపోయిన తర్వాత ఆ వైభవం ఇప్పుడు లేకుండా పోయింది. బద్వేల్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ వరుసగా ఓడిపోవడం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే పార్టీ ఇన్చార్జి మార్చాలని నిర్ణయించారు. డీసీసీబీ చైర్మన్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి కి ఇంచార్జ్ పగ్గాలు ఇచ్చేందుకు అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది మృదు స్వభావి అందర్నీ కలుపుకు వెళ్లే సూర్యనారాయణ రెడ్డి అయితేనే బద్వేల్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి న్యాయం జరుగుతుందని అధిష్టానం నిర్ణయించింది ఇంచార్జ్ పగ్గాలు చ చేపట్టేందుకు సూర్యనారాయణ రెడ్డి సుముఖంగా ఉన్నారు.
==========================