బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆషాడ బోనాల ఉత్సవాలు, కళ్యాణోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించాలి మంత్రి కొండా సురేఖ

బల్కంపేట అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా వుండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కుకున్న మంత్రి కొండా సురేఖ. ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ అమ్మవారు బల్కంపేటలో కొలువై వుండటం తెలంగాణ రాష్ట్రానికి మంగళప్రదం అని మంత్రి అన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట...