బాల 369’ మూవీ కాన్సెప్ట్ బ్రిలియంట్‌గా ఉంది. : హీరో నిఖిల్ సిద్ధార్థ
'జయమ్మ పంచాయతీ’ ఫేమ్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో అర్విన్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాల 369’. ‘అటజని కంచె’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. అర్విన్ ఆర్యశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ కలివరపు, ఎల్లయ్య నిర్మిస్తున్నారు. వైవా హర్ష సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నిఖిల్ సిద్ధార్థ ముఖ్య అతిథిగా...