బీజేపీ, అకాలీదళ్ పొత్తు
ఛండీఘడ్,అర్జున్ సమాచారం: పంజాబ్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా అక్కడ అధికారం చేజిక్కించుకోవాలని పావులు వేగంగానే కదుపుతోంది. అయితే.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ ఓ కీలక ప్రకటన చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. అయినా… అటు బీజేపీ, ఇటు అకాలీదళ్ పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి. అడపా దడపా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతూనే వున్నాయి. కానీ.. ఓ పట్టాన తుది దశకు రావడం లేదు.ఇంత జరుగుతున్నా.. పొత్తుపై...