బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ వేడుకలు
హైద్రాబాద్ సెప్టెంబర్17,అర్జున్ సమాచారం: ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వస్తే.. సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని, అందుకే తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో సెప్టెంబర్ 17 కూడా అంతే పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....