బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,ని.వ{గంగాధర మండలం},అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోందని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర ప్రజా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డా మేడిపల్లి సత్యం అందజేశారు. బూరుగుపల్లి గ్రామానికి చెందిన అన్నాల్దాస్ లలిత,విలసాగర్ లక్ష్మీ,దూలం కవిత,జోగుల సత్తవ్వ,గడ్డం...