బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు టెస్ట్ డ్రైవింగ్‌కు వెళ్తుండగా పొగలు.. క్షణాల్లో దగ్ధమైన కారు

విజయవాడ:అర్జున్ సమాచారం: నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సమీపంలో, జ్యోతి కన్వెన్షన్ ఎదురుగా గురువారం ఉదయం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబిర్కా డీజిల్ మెకానిక్ కార్స్ షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పక్కనే ఉన్న వ్యక్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే డ్రైవర్ కారు ఆపి డోర్ తీసుకుని బయటకు వచ్చేలోపే కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు కొద్దిసేపటికే పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే...