బొమ్మరాస్ పేట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ పర్యటన
వికారాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ కడ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొమ్మరాస్ పెట్ పరిధిలో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల పనులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తో కలిసిపరిశీలించారు. పనులు పూర్తి స్థాయిలో నాణ్యతతో చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కళాశాల ప్రాంబోత్సవ సమయంలోపు అన్ని మౌలిక వసతులతో పాటు రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయన సంబంధిత ఇంజనీర్లకు...