బోటు ప్రమాదంలో తెలుగువారి మృతి సహాయ కార్యక్రమాలకు సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద,అర్జున్ సమాచారం: వియత్నాం పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పర్యాటకులు అక్కడ బోటు ప్రమాదంలో మరణించారనే సమాచారంపై ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మరణించారన్న సమాచారంపై ముఖ్యమంత్రి  వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన...