బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలు.. నిందితుడి అరెస్ట్ క్రెడిట్ కార్డు వివరాలు, OTPలు ఆదిలాబాద్ బాధితుని వద్ద రూ.73,279 మోసం మహారాష్ట్ర గోవా తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 150 ఫిర్యాదులు నమోదు. మూడు రాష్ట్రాల బాధితుల వద్ద 95 లక్షల వరకు మోసం మహారాష్ట్రలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు నిందితుడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్,అర్జున్ సమాచారం: నిందితుడి వివరాలు చైతన్య ప్రమోద్ కుటె (25), S/o ప్రమోద్ కుటె, డబ్కి రోడ్డు, గురుకృప ప్రొవిజన్ సమీపంలో, మెహరేనగర్, భూరడ్ పోస్ట్, అకోలా గ్రామీణ, అకోలా జిల్లా, మహారాష్ట్ర. (ప్రస్తుతం పింప్రి-చించ్వాడ్, పూణే, మహారాష్ట్ర.) బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు మరియు OTPలు సేకరించి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారు.. ఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు...