ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:36 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

భయం వీడండి… ఫిర్యాదు చేయండి… మహిళల భద్రతకు అండగా రామగుండం షీ టీమ్స్: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం,అర్జున్ సమాచారం:                                                                                           ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, మహిళలు,బాలికల భద్రతకు భరోసాగా రామగుండం షీ టీమ్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు,బాలికల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం సేవలందిస్తున్నాయని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖపై, షీ టీమ్స్‌పై విశ్వాసం, భరోసాతో మహిళలు, బాలికలు తమపై జరుగుతున్న వేధింపుల గురించి ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీమ్, మంచిర్యాల జోన్‌లో రెండు షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు.మహిళలు, బాలికలు, చిన్నారులను ఎవరైనా వేధించినా వెంటనే షీ టీమ్స్‌కు సమాచారం అందించాలని సూచించారు.షీ టీమ్ వాట్సాప్ నంబర్: 6303923700
పెద్దపల్లి జోన్ షీ టీమ్: 8712659386
మంచిర్యాల జోన్ షీ టీమ్: 8712659385

అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు కూడా కాల్ చేయవచ్చని తెలిపారు. మహిళలు, బాలికలు సురక్షిత ప్రయాణం కోసం టీ-సేఫ్ (T-SAFE – ట్రావెల్ సేఫ్) యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
============================