భారత్‌లోనే ముందుగా సందడి చేయనున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకగా డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్గా క్రిస్ ఎవాన్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అమెరికా కంటే ఒక రోజు
ముందుగానే డిసెంబర్ 17న ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ దీపావళికి భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక కానుక అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగా 17 డిసెంబర్ 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ...