భారత జీడీపీ వృద్ధి 7.1 శాతం వరల్డ్ బ్యాంక్ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబరు 6,అర్జున్ సమాచారం: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రపంచ బ్యాంకు తన సానుకూల అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) గాను భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.1 శాతానికి పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది. గత ఏప్రిల్‌లో ఈ వృద్ధి అంచనా 6.6 శాతంగా ఉండగా, తాజాగా దానిని 0.5 శాతం మేర సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (క్యూ1) వృద్ధి రేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు...